పవన్ కల్యాణ్ తో తీన్ మార్ సినిమాలో నటించిన కృతి ఖర్బందా తన ప్రియుడు పులకిత్ సామ్రాట్ తో పెళ్లికి సిద్ధమవుతోంది. వీరు ఇవాళ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో రోకా అని పిలుచుకునే వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తమ ఎంగేజ్ మెంట్ విషయాన్ని పులకిత్ గానీ, కృతి గానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.
గత కొంతకాలంగా పులకిత్ సామ్రాట్, కృతి ఖర్బందా లవ్ లో ఉన్నారు. వీరు తమ రిలేషన్ ను సీరియస్ గానే తీసుకున్నారు. తెలుగులో బోణి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి..ఆ తర్వాత రామ్ హీరోగా ఒంగోలు గిత్త, పవన్ తో తీన్ మార్ సినిమాల్లో నటించింది. రామ్ చరణ్ సోదరిగా బ్రూస్ లీ సినిమా చేసింది. బాలీవుడ్ వెళ్లి అక్కడ కెరీర్ స్టార్ట్ చేసిన కృతి పులకిత్ తో కలిసి పాగల్ పంటి సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీరు లవ్ లో పడ్డారు.