దర్శకుడు శేఖర్ కమ్ముల, సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేర. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులను డిఫరెంట్ పోస్టర్లు , గ్లింప్స్ ద్వారా మేకర్స్ పరిచయం చేశారు. ఈ రోజు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా కుబేర నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
చదవండి: వ్యాపారి బరితెగింపు..’ మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? రాజస్థాన్ టూ బెంగుళూరు…?
ధనుష్ బెగ్గర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన మేకోవర్ కూడా బెగ్గర్స్ ఎలా ఉంటారో అలా చేశారు. సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న కుబేర తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది