ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమా కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుంది. ధనుష్, నాగార్జున వంటి ప్రధాన తారాగణంతో ఈ షెడ్యూల్ షూటింగ్ జరపనున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న కుబేర షూటింగ్ కీలక దశకు చేరుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేస్తారని అనుకున్నా..మూవీ టీమ్ నుంచి అలాంటి ప్రకటన ఏదీ రావడం లేదు.
డిసెంబర్ లో కుబేర రిలీజ్ కు వస్తుందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కుబేరలో ధనుష్ బిచ్చగాడి క్యారెక్టర్ లో కనిపించనుండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో చాలా హైప్ క్రియేట్ అయ్యింది. కుబేర ఎలా ఉంటుంది. ఇప్పటిదాకా సాఫ్ట్ లవ్ స్టోరీస్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాతో ఎలా మెప్పించబోతున్నాడు అనేవి క్యూరియాసిటీ కలిగించాయి. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ తో ప్రొడక్షన్ లోనూ భాగమయ్యారు శేఖర్ కమ్ముల.