విశాఖ వైఎంసీఏ బీచ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠీ సందడి చేసింది. ‘బీచ్ పర్ఫెక్ట్ విత్ “మిస్ పర్ఫెక్ట్” ‘ క్లీనింగ్ క్యాంపెయిన్ లో భాగంగా బీచ్ క్లీన్ చేసింది. లావణ్య నటించిన కొత్త వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్” ఫిబ్రవరి 2న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సిరీస్ లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే మిస్ లావణ్య క్యారెక్టర్ లో ఆమె నటించింది. స్క్రీన్ మీదే కాదు బయట కూడా పరిశుభ్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటూ లావణ్య త్రిపాఠీ ‘బీచ్ పర్ఫెక్ట్ విత్ “మిస్ పర్ఫెక్ట్” కార్యక్రమం చేపట్టింది. వైజాగ్ వాలంటీర్స్ తో కలిసి ఆమె ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ – విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నా సూపర్ హిట్ సినిమాలెన్నో షూటింగ్ చేశాం. అందమైన విశాఖ నగరాన్ని మరింత పరిశుభ్రంగా చేద్దాం. ‘బీచ్ పర్ఫెక్ట్ విత్ “మిస్ పర్ఫెక్ట్” కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అని చెప్పింది. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ పర్ఫెక్ట్” స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.