పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని పి.సుశీల ఆరోగ్యంపై శనివారం అర్థరాత్రి ఉన్నపళంగా వచ్చిన ఓ వార్త ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగించింది. వాస్తవానికి తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడ్డ ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో హుటాహుటిన చేర్పించారు కుటుంబసభ్యులు. అయితే ప్రస్తుతం ఆమె చికిత్సపొందుతున్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
చదవండి: త్వరలో ఒకే వేదికపై ‘చిరుసింహా’లు
పి.సుశీలమ్మ బాగుండాలని ప్రార్థనలు..!
86 ఏళ్ల పి.సుశీల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆస్పత్రిలో చేరడంతో ఆమె అభిమానులు, యావత్ సినీలోకం ప్రార్థనలు చేస్తోంది. త్వరగా ఆమె కోలుకుని ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నారు. కాగా, ఎవర్‌గ్రీన్ నైటింగేల్ ఆఫ్ ఇండియన్‌గా పిలవపడే పి.సుశీలమ్మ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్‌గా, మెలోడీ క్వీన్‌గా ముద్రపడ్డారు. నాలుగు దశాబ్దాలుగా సాగిన ఆమె స్వర ప్రస్థానం…దక్షిణాది దిక్కున ప్రారంభమై నలుదిక్కులకూ విస్తరించిన ఘనత ఒక్క పి.సుశీలమ్మకే సొంతం.