లారి – చాప్టర్ 1: రివ్యూ

Spread the love

సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి శ్రీకాంత్ రెడ్డి ఆసం సుపరిచితమే. ఆయన తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని స్వ‌యంగా తెలుగు , తమిళ , కన్నడ ,హిందీ ,బెంగాళీ బాషల్లో తీసిన సినిమా “లారీ – చాప్టర్ -1”. శ్రీకాంత్ రెడ్డి ఆసం హంటింగ్ స్టార్‌గా, హీరోగా నటిస్తూ, దర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి హీరోగా వెండి తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ చంధ్ర శిఖ. రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ఆసం వెంకటలక్ష్మి ఈ సినిమాను నిర్మించారు. తాజాగా థియేట‌ర్‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథేంటంటే

చిత్తూరు దగ్గర రంగపట్నంలో నివసించే హర్షవర్ధన్ ఆలియ‌స్ హంట‌ర్ (శ్రీకాంత్ రెడ్డి ఆసం) పేరుతో వీధి రౌడీగా చ‌ల‌మ‌ణిలో ఉంటాడు. తన కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న గొడవల్లో పడిపోతూ ఉంటాడు. ఓ సమయంలో జైలు పాలవ్వడం, తర్వాత ఒక అమ్మాయితో ప్రేమలో పడటం, చివరకు మెకానిక్ షాప్ పెట్టి సాధారణ జీవితం సాగించే ప్రయత్నం చేస్తాడు. ప్రతాప్ అనే మైనింగ్ అధిపతి ముఖ్యమంత్రి అవ్వాలని, తనకావాల్సిన డబ్బు కోసం ఇల్లీగల్ మైనింగ్ చేపిస్తాడు. అతను మైనింగ్‌లో కనుగొన్న యురేనియం‌ని అమ్మటానికి హర్షవర్ధన్ సహకారం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. హర్షవర్ధన్ తన చెల్లి పెళ్లి కోసం, కుటుంబం పైస్థాయికి వెళ్ళడం కోసం ఈ పనికి ఒప్పుకుంటాడు. 3000 కోట్ల సరుకును ముంబైకి డెలివరీ చేయడం కోసం లారీ డ్రైవ్ చేస్తాడు. ఈ ప్రయాణంలో దేశంలోని వివిధ రాష్ట్రాల విలన్లు లారీని ఆపడానికి ప్రయత్నిస్తారు. చివరికి హర్షవర్ధన్ యురేనియం డెలివర్ చేశాడా? అతని తండ్రి బ‌తికి ఉన్నాడా? ఇతివృత్తంలో ఉన్న విలన్లు అతని వెంట ఎందుకు పడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రంలో చూడవచ్చు.

చదవండి: విరాజి రివ్యూ

ఎవరెలా చేశారంటే

ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం శ్రీకాంత్ రెడ్డి ఆసం. యూట్యూబ్ స్టార్‌గా తనకు సంపాదించిన అనుభవంతో ఈ సినిమాను మ‌న ముందు నిల‌బెట్ట‌డంలో విజ‌యం సాధించాడ‌నే చెప్పాలి. న‌టించ‌డంతో పాటు సినిమా నిర్మాణం చేయడంలో అనుభవం చూపించారు. దర్శకత్వం, నటన, సంగీతం, ఎడిటింగ్, స్టంట్‌లన్నీ తనే నిర్వహించి మ‌ల్టీటాలెంట్ చూపించారు. హీరోగా శ్రీకాంత్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ ఇర‌గ‌దీశాడు. ఫ‌స్ట్ మూవీలోతో త‌న‌లోని టాలెంట్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌లో నిల‌బెట్టాడు. హీరోయిన్ చంద్రశిఖ క్యూట్‌గా క‌నిపించింది. రొమాన్స్ సీన్ల‌లో యూత్‌ను ఎట్రాక్ట్ చేసింది. ఇక‌ రాకీ సింగ్, చంద్రశిఖ శ్రీవాస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం ప్రతిభ

సినిమాటోగ్ర‌ఫీ తాడిపత్రి నాగార్జున అందించిన విజువల్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మ్యూజిక్ ట్రాక్ సినిమాను మ‌రో మెట్టు ఎక్కించింది, లిరికల్ వీడియోస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నాణ్యత ఉంది. టెక్నికల్ బ్రిలియెన్స్ ఈ సినిమాలో క్లియర్ గా కనిపిస్తుంటుంది.

సమీక్ష

శ్రీకాంత్ రెడ్డి ఆసం తాను అనుకున్న క‌థ‌ను స్క్రీన్‌పై ప‌ర్‌ఫెక్టుగా ప్ర‌జెంట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. కోట్ల మంది ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్న యూట్యూబ‌ర్ శ్రీకాంత్ రెడ్డికి ఇది తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి పార్టులో ఎంతో ప‌రిణ‌తి, అనుభ‌వం చూపించాడు. ”హంటర్‌తో ఆట.. పగులుతుంది నీ చాట” ”నీ వెనుక ఎవరు ఉన్నది ముఖ్యం కాదు – నీ ముందు ఎవరు ఉన్నది ముఖ్యం..” వంటి డైలాగ్‌లో థియేట‌ర్‌లో ఈల‌ల పెట్టించాయి. లారీ – చాప్టర్ 1 యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో నిండి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ల‌వ్ ఆండ్ రొమాన్స్ సీన్లు యూత్‌ను తెగ ఆక‌ట్టుకుంటాయి. ఇక తండ్రి సెంటిమెంట్ ఈ సినిమాలో అంద‌రికి న‌చ్చుతుంది. శ్రీకాంత్ రెడ్డి ఆసం ఒక యూట్యూబర్ నుండి సినిమా రంగానికి తన ప్రయాణం ఈ త‌రం వాళ్ల‌కి స్ఫూర్తిదాయకం. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభవం కలిగిస్తుంది. శ్రీకాంత్ రెడ్డి ఆసం మల్టీటాలెంటెడ్ సత్తా ఎంటో చూడాలంటే థియేట‌ర్‌లో సినిమా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...