శోభనం గదిలో పాల గ్లాస్ ఇవ్వడం సంప్రదాయం. రాత్రి మేల్కొని ఉంటే పాలు శక్తినిస్తాయని పెద్ద వాళ్లు పెట్టిన ట్రెడిషన్ ఇది. అదే శోభనం గదిలో పాలకు బదులు విస్కీ కలిపితే ట్రెండ్ సెట్ చేయడం అనుకోవచ్చు. ఈ ట్రెండ్ కొత్త పెళ్లికూతురు సెట్ చేస్తే పెళ్లి కొడుకు షాక్ అవక ఏం చేస్తాడు. ఇదే సీన్ లవ్ గురు సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీకి ఎదురైంది. హీరోయిన్ గా నటిస్తున్న మృణాళినీ రవి విస్కీ గ్లాస్ లో పోసుకుంటూ ఉండగా..హీరో విజయ్ ఆంటోనీ స్టన్ అయిపోయి చూస్తున్నాడు.
ఈ స్టిల్ తో రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు లవ్ గురు టీమ్. విజయ్ ఆంటోనీ అంటే బిచ్చగాడు హీరో గుర్తొస్తాడు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఆయన రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కనిపించబోతున్నారు. సమ్మర్ లో లవ్ గురు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.