సినిమాలోని ఎమోషన్ కు కనెక్ట్ అయ్యే ప్రేక్షకులు ఆ సినిమాలో ఎన్ని ముద్దులున్నాయో లెక్కపెడుతూ కూర్చుంటే ఎలా ఉంటుంది. ఆ పరిస్థితి నవదీప్ లవ్ మౌళి సినిమాకు వచ్చింది. ఆ సినిమా థియేటర్ లో చూస్తున్నవారు ఎన్ని లిప్ లాక్స్ ఉన్నాయో కౌంట్ చేస్తూ కూర్చున్నారు. ఈ సినిమాలో దాదాపు 40 ముద్దులు ఉన్నట్లు క్రిటిక్స్ లెక్క తేల్చారు. అంతగా ముద్దుల వర్షం కురిపించాడు హీరో నవదీప్ లవ్ మౌళి సినిమాలో.
అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ ఇండస్ట్రీని ఇంకా వదల్లేదని చెప్పేందుకు లవ్ మౌళి లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇటీవల థియేటర్స్ లోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన లవ్ మౌళి సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సీ స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ నిర్మించాయి.