అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచాయి. మేకర్స్ ఇప్పుడు మ్యూజిక్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘మా ఊరి జాతరలో..’ రిలీజ్ అయ్యింది. సీతారామం ఫేమ్ కంపోజర్ విశాల్ చంద్రశేఖర్ పాటను స్కోర్ చేసారు. ఈ మెలోడీని సింధూరి విశాల్‌తో కలిసి హను-మాన్ కంపోజర్ గౌరా హరి పాడారు.
అల్లరి నరేష్, అమృత అయ్యర్‌ల బాండింగ్‌ని లిరిసిస్ట్ శ్రీమణి చాలా ఆకర్షణీయంగా అందించారు. లీడ్ పెయిర్ ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ పదాలు వివరిస్తాయి. నరేష్ తన భార్యకు ఏదో ఒక స్పెషల్ ప్రెజెంట్ చేయలాని కోరుకుంటుండగా, ఆమె తన జీవితాంతం అతనితో గడపాలని కోరుకుంటుంది. విజువల్స్ కంపోజిషన్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. అల్లరి నరేష్, అమృత అయ్యర్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్‌లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. బచ్చల మల్లి ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది.