తన కొత్త సినిమా కోసం మహేశ్ బాబు వర్క్ మొదలుపెట్టారు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో మహేశ్ పర్యటిస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 మూవీ కోసం లోకల్ టెక్నీషియన్స్ తో కలిసి మహేశ్ ఈ ఫారెస్ట్ ట్రిప్ వెళ్లారు. మహేశ్ జర్మనీ ఫారెస్ట్ లో తిరుగుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి రాజమౌళితో మహేశ్ చేస్తున్న సినిమా కోసమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహేశ్ రాజమౌళి కాంబోలో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఎస్ఎస్ఎంబీ 29 తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేశారు. ఈ సినిమాను జంగిల్ అడ్వెంచర్ గా తీర్చిదిద్దుతున్నారు. మహేశ్ ఈ సినిమా కోసం అన్ని విధాలా మేకోవర్ అవుతున్నారు. ఇది తన కెరీర్ లో ఒక ప్రెస్టీజియస్ మూవీగా ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎస్ఎస్ఎంబీ 29 లాంఛనంగా ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది.