తన కొత్త సినిమా ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా జర్మనీ వెళ్లిన సూపర్ స్టార్ మహేశ్ బాబు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో లోకల్ టెక్నీషియన్స్ తో కలిసి మహేశ్ బాబు రిహార్సల్స్ చేశారు. దాదాపు వారం రోజుల పాటు మహేశ్ ఈ రిహార్సల్స్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ లో మహేశ్ నడిచి వస్తున్న ఫొటోస్ ఫ్యాన్స్ బాగా షేర్ చేస్తున్నారు.
త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 29 సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసుకోనున్న నేపథ్యంలో మహేశ్ కూడా తన వర్క్స్ స్పీడప్ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో జంగిల్ అడ్వెంచర్ గా ఈ సినిమా ఉండబోతోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ లో అటు మహేశ్ తో పాటు రాజమౌళి కూడా పార్టనర్స్ గా ఉండబోతున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా షేర్ తీసుకుని పెట్టుబడి పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.