గౌతమ్ కంటే సితారకు సినిమా ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఎక్కువ అని గతంలో చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు మహేశ్ బాబు, నమ్రత. గౌతమ్ కంటే సితార యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే కొన్ని యాడ్స్ చేసింది, యానిమేషన్ మూవీస్ కు డబ్బింగ్ చెప్పింది. గౌతమ్ గ్లామర్ ఫీల్డ్ లో ఇంత ఫోకస్ కాలేదు. కామ్ గా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు గౌతమ్ కూడా టాలీవుడ్ కు వచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలోనే అతను నటన మీద ఆసక్తి చూపిస్తున్నాడు. లండన్ లో జరిగిన రోమియో జూలియట్ అండ్ ఎక్సెట్రా అనే థియేటర్ ప్లేలో అతను నటించాడు. ఈ నాటకం చూసేందుకు మహేశ్, నమ్రత, సితార, నమ్రత సోదరి శిల్పా, వారి కుటుంబ సభ్యులు లండన్ వెళ్లారు. అక్కడ సమ్మర్ లో పిల్లలకు జాయ్ ఆఫ్ డ్రామా పేరుతో నాటకాలు వేయిస్తుంటారు. ఇందులో గౌతమ్ పాల్గొని నటించాడు. ఈ స్టేజ్ ప్లేలో గౌతమ్ నటన చూసి సంతోషాన్ని వ్యక్తం చేసింది నమ్రత. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.