గుంటూరు కారం సినిమా ప్రమోషన్ నుంచి బయటకు వచ్చారు మహేశ్ బాబు. ఇక ఈ సినిమా సంగతి వదిలేసి తన కొత్త సినిమాపై దృష్టి పెట్టారు. ఎస్ఎస్ఎంబీ 29గా పిలుస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి రూపొందించనున్నారు. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్. జంగిల్ అడ్వెంచర్ గా తెరకెక్కే ఈ సినిమా వర్క్స్ స్పీడప్ చేశారు మహేశ్ బాబు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా మహేశ్ బాబు జర్మనీ వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు ప్రీ ప్రొడక్షన్ పై అవగాహన తెచ్చుకోనున్నారు.
మహేశ్ ను ఈ ప్రాజెక్ట్ లో పూర్తిగా ఇన్వాల్వ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. సినిమాకు సంబంధించిన ప్రతి విషయం హీరోకు తెలిస్తే ఔట్ పుట్ లో క్లారిటీ ఉంటుందని దర్శకుడు అనుకుంటున్నారు. ఇప్పటికే ఎస్ఎస్ఎంబీ 29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని రచయిత విజయేంద్రప్రసాద్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఏడాదే ఈ ప్రెస్టీజియస్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.