సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా ఓటీటీ డేట్ ఫిక్సయ్యింది. ఈ సినిమా ఈ నెల 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించారు. ఓటీటీ డేట్ మీద ఎలాంటి బజ్ లేకుండా సడెన్ గా అనౌన్స్ చేయడం సర్ ప్రైజ్ చేస్తోంది. మహేశ్ ఫ్యాన్స్ గుంటూరు కారం ఓటీటీ డేట్ పోస్టర్ ను బాగా షేర్ చేస్తున్నారు.
సంక్రాంతికి మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా గుంటూరు కారం రిలీజైంది. గత నెల 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించినంత సక్సెస్ అందుకోలేదు. త్రివిక్రమ్ మహేశ్ కాంబినేషన్ లో ఉన్న హైప్ ను ఏమాత్రం రీచ్ కాలేదు. పోస్ట్ రిలీజ్ సినిమాను నిలబెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేసినా…సినిమాలో విషయం లేకుంటే ఎన్ని చేసిన ఉపయోగం లేదని తేలింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో వచ్చే రెస్పాన్స్ కోసం టీమ్ ఎదురుచూస్తోంది.