సినిమాల్లోని ఇంపార్టెంట్ విషయాలు చెబుతూ చిరంజీవి చిరు లీక్స్ అనే పేరు తెచ్చుకున్నారు. నిన్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ లో మహేశ్ కూడా ఇలాగే సినిమాలోని హీరోయిన్ మీనాక్షి గురించి ఇలాంటి లీక్ ఒకటి చేశారు. మహేశ్ మాట్లాడుతూ ఆమెది గెస్ట్ రోల్ అని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు. మీనాక్షిది శ్రీలీలతో పాటు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అంటూ సినిమా టీమ్ వెబ్ సైట్స్ కు లీక్స్ ఇస్తే..మహేశ్ అందుకు విరుద్ధంగా ఆమెది గెస్ట్ రోల్ అంటూ చెప్పేశాడు.
ఇక శ్రీలీలను పొగడ్తలతో ముంచేశాడు మహేశ్. శ్రీలీలతో పోటీ పడి డ్యాన్సులు చేయడం మామూలు విషయం కాదన్నారు మహేశ్. హీరోలకు ఆమెతో డ్యాన్సులు చేయాలంటే తోలు ఊడిపోతుందని సరదాగా చెప్పారు. ఈ వీడియో బిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేశ్ మాట్లాడుతున్నంత సేపు సిగ్గుపడుతూనే ఉంది శ్రీలీల. సెట్ లో ఆమె డెడికేషన్ గురించి మహేశ్ చెప్పారు. త్రివిక్రమ్, ప్రొడ్యూసర్ చినబాబు సపోర్ట్ మర్చిపోలేనని, ఇదే బ్యానర్ లో మరిన్ని మూవీస్ చేయాలని ఉందని మహేశ్ అన్నాడు.