సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనియా యూఎస్ లో మొదలైంది. ఆయన గుంటూరు కారం సినిమా బుకింగ్స్ యూఎస్ లో పలు లొకేషన్స్ లో ప్రారంభమయ్యాయి. ఓపెన్ అయిన లొకేషన్స్ లో బుకింగ్స్ బాగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ 2 లక్షల డాలర్స్ దాటేశాయి. మరిన్ని లొకేషన్స్ లో బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఇక్కడ కూడా ప్రీమియర్ షోస్ టికెట్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరిగే అవకాశాలున్నాయి.
మహేశ్ సినిమాలకు యూఎస్ లో మంచి ఆదరణ దక్కుతుంటుంది. గుంటూరు కారం సినిమా మీదున్న హైప్ తో అవి ఆయన కెరీర్ లోనే హయ్యెస్ట్ ఉండొచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బుక్ మై షో వంటి యాప్స్ లో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్స్ కనిపిస్తున్నాయి. మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించిన గుంటూరు కారం సినిమా ఈ నెల 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.