సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ వైరల్ అవుతోంది. తన బర్త్ డే కోసం జైపూర్ వెళ్లిన మహేశ్ బాబు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. జైపూర్ ఎయిర్ పోర్ట్ లో మీడియా తీసిన ఆయన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గడ్డం, పోనీ టెయిల్ తో మహేశ్ సరికొత్త మేకోవర్ లో కనిపిస్తున్నారు.
చదవండి: 2 రోజుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ కలెక్షన్స్ ఎంతంటే?
ఈ లుక్ రాజమౌళితో ఆయన చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 కోసమే అనే అనుకోవచ్చు. జంగిల్ అడ్వెంచర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ లో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.