సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందించే సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా ఇప్పటిదాకా చేరని రేంజ్ లో ఈ సినిమా మేకింగ్ ఉండబోతోందట. ఎస్ఎస్ఎంబీ 29గా పిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ మూడు దేశాల్లో చేయబోతున్నారు. సుమారు వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో ఎస్ఎస్ఎంబీ 29 తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది.
జంగిల్ అడ్వెంచర్ గా ఉండబోతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోని అమోజాన్ అడవుల్లో చేయబోతున్నారు. షూటింగ్ కోసం లొకేషన్స్ రెక్కీ కూడా జరుపుతున్నారు. ఇందుకోసం ఒక హాలీవుడ్ స్టూడియోతో డైరెక్టర్ రాజమౌళి అగ్రిమెంట్ చేసుకున్నారు. లోకల్ ఆర్టిస్టులను ఇవ్వడం, ప్రొడక్షన్ లో హెల్ప్ చేయడం వంటివి ఈ స్టూడియో చూసుకుంటుంది. కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కొద్ది రోజుల్లోనే లాంఛనంగా అనౌన్స్ కానుంది.