స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కంగువ రిలీజ్ విషయంలో నెట్టింట సర్క్యులేట్ అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. కంగువ రిలీజ్ డేట్ పై తామింకా ఏ నిర్ణయానికీ రాలేదని వారు తెలిపారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి సూర్య పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కంగువ సినిమా రిలీజ్ పై మేకర్స్ స్పందించారు.
రిలీజ్ డేట్ గురించి తామింకా నిర్ణయానికి రాలేదని, షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలి ఉందని, అది పూర్తయ్యాకే డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. త్రీడీ వెర్షన్ కూడా రిలీజ్ ఉంటుందని, మొత్తం పది భాషల్లో కంగువను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు విదేశీ భాషల్లోనూ కంగువను అందుబాటులో ఉంచుతామని, సీజీ వర్క్ భారీగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ముందే రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఈ పనులన్నీ ఒత్తిడితో చేయాల్సివస్తుందని వారు తెలిపారు. సూర్య రీసెంట్ గా కంగువలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు.