పుష్ప 2 సినిమా విషయంలో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, సినిమా షూటింగ్ కు విరామం ఇచ్చారంటూ వచ్చిన వార్తలపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేం లేదని, ఈ నెల 28వ తేదీ నుంచి అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నారని..అనుకున్నట్లే డిసెంబర్ 6వ తేదీకి సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు.
ఆగస్టు 15వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీకి పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడీ డేట్ కూడా కన్ఫర్మ్ కాదని, వచ్చే ఏడాదికి ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి. సుకుమార్ అమెరికా వెళ్లడం, అల్లు అర్జున్ వ్యక్తిగత టూర్ కు వెళ్లడంతో పుకార్లు నిజమేనని అంతా అనుకున్నారు. ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన ప్రకటనతో స్పష్టత వచ్చినట్లయింది.