నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల ఇప్పటికే భీష్మ అనే సూపర్ హిట్ సినిమా చేశారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది. గత సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ కొత్త సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకు ఎన్ వీ 2 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఇవాళ ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హీరో ఫొటోలో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. శాంటా క్లాజ్ డ్రెస్ లో ఉన్న హీరో క్యారెక్టర్ ను ఈ నెల 26న ఉదయం 11.07 నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
గిప్ట్ లు ఇచ్చే సీజన్ ముగిసింది. ఇక దొంగతనాలు చేసే సీజన్ మొదలవనుంది అంటూ ఈ సందర్భంగా క్యాప్షన్ రాశారు. జెంటిల్ మేన్, కిక్ లాంటి రాబరీ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హీరోను ఒక రాబిన్ హుడ్ లా, మంచి దొంగలా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో భీష్మ సినిమాలో ఆర్గానిక్ ఫార్మింగ్ అనే మంచి పాయింట్ చెప్పిన దర్శకుడు వెంకీ కుడుముల..ఈ సినిమాలోనూ సోషల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తూ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్నారట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.