మల్లువుడ్‌లో మంచమెక్కాలా..? కాకరేపుతున్న హేమ రిపోర్ట్‌

Spread the love

మలయాళ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం రాజుకున్న వేళ… పినరయి సర్కార్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. సో, ఈ క్రమంలో జస్టిస్ కె.హేమ ఆధ్వర్యంలో మల్లువుడ్‌లో నటీమణులు పడుతున్న బాధలపై ఓ రిపోర్ట్ తయారుచేసి గవర్నమెంట్‌కు అందించారు. ఇప్పుడీ రిపోర్ట్ కేరళలో కాక పుట్టిస్తోంది.

రిపోర్ట్‌ను బయటపెట్టిన పినరయి సర్కార్‌

మల్లువుడ్‌లో మహిళలు పడుతున్న బాధలపై నివేదిక రూపొందించేందుకు రంగంలోకి దిగిన జస్టిస్ కె.హేమ బృందం…సుమారు 51మంది నటులు, టెక్నీషియన్స్‌ యొక్క అభిప్రాయాలు సేకరించి 233 పేజీలతో కూడిన రిపోర్ట్‌ను సీఎం పినరయి విజయన్‌కు అందజేసింది. దీంతో సదరు సర్కార్ నివేదికను బహిర్గతం చేయడంతో మల్లువుడ్‌ బాగోతం బట్టబయలయింది.

లొంగితేనే ఇక్కడ జీవితం సుఖాంతం..!

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్నాళ్లు బతుకీడ్చాలంటే మహిళలు వీటిని ఎదుర్కోవాల్సిందే అంటూ జస్టిస్ కె.హేమ…తన విచారణలో ఎదురైన అనుభవాలను నివేదికలో పొందుపరిచారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌, లైంగిక వేధింపులు, రెమ్యునరేషన్‌లో వ్యత్యాసాలు, షూటింగ్‌ టైమ్‌లో సరైన వసతులు చూపకుండా ఇబ్బందులు పెట్టడం, వారి వ్యక్తిగత గోప్యతను విస్మరించడం లాంటి అనేక సమస్యలతో మల్లువుడ్‌లో పనిచేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని నిర్థారించారు.

హేమ రిపోర్ట్‌లో ఓ కామ హీరో కథ..!

తాను కలిసిన వారిలో ఓ హీరోయిన్ పడ్డ బాధలను రిపోర్ట్‌లో జతచేశారు జస్టిస్ కె.హేమ. షూటింగ్‌కు ముందు లైంగికంగా వేధించిన హీరోతో… హగ్‌ సీన్ చేసేందుకు ఓ నటి ఇబ్బంది పడ్డారని, సదరు హీరో ప్రవర్తనతో 17 టేక్స్ తీసుకున్నారని, ఈ క్రమంలో ఆ మూవీ నటి చాలా ఇబ్బందులకు గురైయ్యారని నివేదికలో పొందుపరిచిన హేమ…ఇండస్ట్రీని ఓ మాఫియా కంట్రోల్ చేస్తుందని ఆరోపించారు.

హేమ రిపోర్ట్‌పై భిన్నభిప్రాయాలు
నెట్టింట వాదోపవాదనలు

రాజకీయంగా, ఆర్థికంగా, కులాలపరంగా వ్యత్యాసాలు ఉన్న మన ఇండియాలో ఇవన్నీ కామనే అంటూ కొందరు అంటుంటే…ఈ నివేదిక ఒక్క మల్లువుడ్‌ ఇండస్ట్రీకే పరిమితం కాదని, అన్నీ ఇండస్ట్రీలలో ఇది సర్వసాధారణమని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యంత అక్షరాస్యత గల రాష్ట్రంలో ఇలాంటివి జరగడం మన దౌర్భాగ్యమని కొందరు అంటుంటే…కె.హేమ రిపోర్టులో ఉన్న మగజాతి పేర్లు ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, మల్లువుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్ అనేది ఎప్పటినుంచో నడుస్తుందని, ఇప్పుడీ రిపోర్ట్‌ను సడన్‌గా తీసుకొచ్చి మరో అతిపెద్ద ఇష్యూని డైవర్ట్‌ చేసే కుట్రగా పినరయి సర్కార్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...