రాజ్ తరుణ్ హీరోగా, డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి రూపొందుతున్న సినిమా ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రొమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ సినిమా విశేషాలని పంచుకున్నారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ఈ ప్రాజెక్ట్ 2023లో స్టార్ట్ అయ్యింది. డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ గారు కథ చెప్పగానే నచ్చింది. సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాను. ఈ కథకు రాజ్ తరుణ్ యాప్ట్ గా ఉంటుందని ముందే అనుకున్నాం. ఎవరైనా సిట్యుయేషన్ బట్టే బిహేవ్ చేస్తారు. సైలెంట్ గా వున్న పర్సన్ ని వైలెంట్ గా మార్చేది సిట్యుయేషనే. ఈ కథలో కూడా అలాంటి సిట్యుయేషన్ వుంటుంది. ఒక మామూలు కుర్రాడిని తన లైఫ్ లో వచ్చే సిట్యుయేషన్స్ ఎలా మార్చాయనేది చాలా ఆసక్తికరంగా వుంటుంది. కథని ప్రకారమే వైలెన్స్ వుంటుంది.
చదవండి: అందుబాటు టికెట్ ధరల్లో ‘విరాజి’
రాజ్ తరుణ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. భార్య భర్తలు మూడు ముళ్ళ బంధానికి ఏ విధంగా కట్టుబడి ఉండాలనడానికి నిదర్శనం ఈ సినిమా. కంటెంట్ చాలా బావుంటుంది. అందరికీ నచ్చుతుంది. రవికుమార్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. చెప్పినదాని కంటే అద్భుతంగా తీశారు. చాలా కోపరేట్ చేశారు. వెరీ గుడ్ డైరెక్టర్. బాలీవుడ్ లో చేస్తున్న కథ చాలా నచ్చింది, నా స్నేహితుడు రాజ్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో స్టేజ్ లో వుంది. అలాగే రాహు కేతు అనే వెబ్ సిరిస్ కూడా చేస్తున్నాం. అలాగే తిరుపతి బాలాజీపై ఒక వెబ్ సిరిస్ చేస్తున్నాం. జేడీ చక్రవర్తి ,నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ తో ఓ సినిమా జరుగుతోంది. ఈ సినిమా శ్రవణ్ అనే దర్శకుడుని పరిచయం చేస్తున్నాం. అన్నారు.