చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “తంగలాన్” సినిమా నుంచి ‘మనకి మనకి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
‘మనకి మనకి..’ లిరికల్ సాంగ్ ను జీవీ ప్రకాష్ కుమార్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా సింధూరి విశాల్ ఎనర్జిటిక్ గా పాడారు. ‘మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే చాన్నాళ్లకి ..అలికీ అలికీ ఊరే అలికీ.. ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకీ..’ అంటూ సాగుతుందీ పాట. ఓ శుభవార్త విన్న గూడెం ప్రజలంతా సంతోషంలో తేలిపోతున్న సందర్భంలో ఈ పాటను రూపొందించారు.