శర్వానంద్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మనమే డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. అమోజాన్ ప్రైమ్ వీడియోలో నెక్ట్ వీక్ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
వరుస ఫ్లాప్స్ లో ఉన్న శర్వానంద్, కృతి శెట్టికి మనమే సినిమా కూడా పెద్దగా రిలీఫ్ ఇవ్వలేదు. గత నెల 7న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. పవర్ ఫుల్ యాక్షన్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆడుతున్న ట్రెండ్ లో ఈ టైమ్ పాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పట్ల ఎవరూ ఎగ్జైట్ కాలేదు. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోనైనా గుడ్ రెస్పాన్స్ వస్తుందనే హోప్స్ పెట్టుకుంది మనమే టీమ్.