మంచు లక్ష్మి హీరోయిన్ గానే కాదు విలన్ గా కూడా నటించింది. అందుకే ఆమెకు పాజిటివ్ తో పాటు నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా వస్తుంటాయి. క్రిష్ డైరెక్షన్ లో అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఐరేంద్రిగా నటించింది మంచు లక్ష్మి. ఆ క్యారెక్టర్ ఎఫెక్ట్ ఇంకా ఆమెపై ఉంది. అందుకే యక్షిణి లాంటి వెబ్ సిరీస్ లు ఆమెకు దక్కుతున్నాయి. ఇప్పుడు ఆదిపర్వం అనే సినిమాలో సోషియో ఫాంటసీ క్యారెక్టర్ లో కనిపించనుంది మంచు లక్ష్మి.
ఈ సినిమాలో నాగులాపురం నాగమ్మగా మంచు లక్ష్మి నటిస్తోంది. ఆదిపర్వం సినిమా తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా రాబోతోంది. దర్శకుడు సంజీవ్ మోగోటి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆదిపర్వం ఈ సినిమాలో మంచు లక్ష్మి భారీ యాక్షన్ సీక్వెన్సులు చేసింది. దేవత అయినా దెయ్యం అయినా తననే దర్శకులు అడుగుతున్నారంటూ చెబుతోంది మంచు లక్ష్మి.