మనతో కలిసి పనిచేసిన వారు భౌతికంగా దూరమయితే ఆ బాధ మాటల్లో చెప్పలేం. ఇదే బాధను వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు మంచు మనోజ్. ఆయన హీరోగా నటించిన నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి నిన్న కన్నుమూశారు. అజయ్ శాస్త్రి మృతి వార్త విన్న మనోజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
చదవండి: తరుణ్ భాస్కర్ మరో కొత్త ప్రయత్నం
అజయ్ శాస్త్రి లేరనే వార్తను నమ్మలేకపోతున్నానంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు మంచు మనోజ్. అజయ్ శాస్త్రి దర్శకత్వం వహించిన ఏకైక చిత్రమిది. నేను మీకు తెలుసా సినిమా 2008 లో రిలీజైంది. సైకలాజికల్ థ్రిల్లర్, ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అజయ్ శాస్త్రి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు మనోజ్ ట్వీట్ చేశారు.