మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. ‘కన్నప్ప’ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాతో మంచు విష్ణు కొడుకు అవ్రామ్ ను చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అవ్రామ్ తో మంచు విష్ణు దిగిన ఫొటోను షేర్ చేశారు.
‘కన్నప్ప’ టీమ్ శరవేగంగా షూటింగ్ చేస్తోంది. ఇటీవలే న్యూజిలాండ్‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది కన్నప్ప టీం. కొడుకు అవ్రామ్ ను పరిచయం చేయడంపై మంచు విష్ణు స్పందిస్తూ – ‘ఈ ‘కన్నప్ప’ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం హ్యాపీగా అనిపిస్తోంది. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన ప్రాజెక్ట్’ అని చెప్పారు. ‘కన్నప్ప’ సినిమా నెక్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.