ఎంటీ వాసుదేవన్ నాయర్ పుట్టినరోజు సందర్భంగా 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో మలయాళ ఇండస్ట్రీలోని అత్యుత్తమ టెక్నీషియన్లంతా కలిసి 9 ఆసక్తికరమైన కథలతో రాబోతోన్న’మనోరథంగల్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్ట్ 15న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఎంటీ అని పిలుచుకునే సాహితీ దిగ్గజం మాదత్ తెక్కెపాట్టు వాసుదేవన్ నాయర్ 90వ పుట్టిన రోజుని పురస్కరించుకుని రూపొందించిన అద్భుతమైన చిత్రం ‘మనోరథంగల్’ ఆగస్టు 15న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ‘మనోరతంగళ్’ వాసుదేవన్ నాయర్ రచించిన తొమ్మిది కథల సంకలనమే ఈ వెబ్ సిరీస్. ఈ తొమ్మిది కథలకూ ఓ కనెక్షన్ ఉంటుంది. 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ దర్శకులతో ఈ వెబ్ సిరీస్ జీ5లో రాబోతోంది.
తొమ్మిది కథలకు ఎనిమిది మంది టాప్ డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, జరీనా, బిజు మీనన్, కైలాష్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ వంటి వారు ఈ తొమ్మిది కథల్లో నటించారు. వీటికి ప్రియదర్శన్, రంజిత్, శ్యామప్రసాద్, జయరాజన్ నాయర్, సంతోష్ శివన్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్ వంటి వారు దర్శకత్వం వహించారు.