స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు రాజా సాబ్ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎల్లుండి ఈ సినిమా నుంచి అఫీషియల్ గా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి రోజున ఉదయం 7 గంటల 8 నిమిషాలకు ప్రభాస్ ది వింటేజ్ డార్లింగ్ ను పరిచయం చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.
హారర్ కామెడీ కథతో ఈ సినిమా ఉండబోతోంది. పాడుబడిన ఓ థియేటర్ నేపథ్యంగా ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఫస్ట్ టైమ్ ప్రభాస్ రొమాంటిక్ హారర్ మూవీలో నటిస్తుండటంతో క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ సరసన మాళవిక నాయర్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా.