స్టార్ హీరోల బర్త్ డేలకు వాళ్ల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ కావడం ఇటీవల టాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది. రీసెంట్ గా మహేశ్ బాబు బర్త్ డేకు మురారి రిలీజై మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఇప్పుడు నాగార్జున సూపర్ హిట్ మూవీ మాస్ థియేటర్స్ లోకి రాబోతోంది.
చదవండి: “తంగలాన్”లో ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి – హీరో చియాన్ విక్రమ్
నాగార్జున పుట్టినరోజైన ఈనెల 28న మాస్ సినిమా విడుదల కానుంది. 4కె వెర్షన్ లో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట మాస్ సినిమా రిలీజైంది. దర్శకుడిగా లారెన్స్ కు ఇది ఫస్ట్ మూవీ. నాగార్జునను కొత్తగా తెరపై చూపించిందీ సినిమా. పాటలు, పైట్స్, హీరోయిజం బాగుండటంతో సినిమా సక్సెస్ అయ్యింది. ఈ చిత్రంలో జ్యోతిక, ఛార్మి కౌర్ హీరోయిన్స్ గా నటించారు.