వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమా గ్లింప్స్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఓపెనింగ్ బ్రాకెట్ పేరుతో ఈ గ్లింప్స్ ను విడుదల చేశారు. హీరోయిజం ఎలివేట్ చేస్తూ ఈ గ్లింప్స్ ఉంది. ఫోన్ లో డీల్స్ చేస్తూ రిజిస్టర్ లో నోట్ చేసుకుంటున్న వరుణ్ తేజ్ చుట్టూ డబ్బు కట్టలు, విస్కీ బాటిల్స్ ఉన్నాయి. గ్లింప్స్ లో నవీన్ చంద్ర, మరికొంతమంది ఆర్టిస్టులు కనిపించారు. మట్కా గ్లింప్స్ కథ మీద ఎలాంటి హింట్ ఇవ్వకున్నా..హీరో సెంట్రిక్ మూవీ అని తెలుస్తోంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నోరా ఫతేహి మరో కీ రోల్ చేస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. పాన్ ఇండియా మూవీగా హిందీ సహా సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతోంది.