మెకానిక్ – ట్రబుల్ షూటర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

Spread the love

టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో మేకల నాగ మునెయ్య క్రియేషన్స్ బ్యానర్ లో మేకల నాగ మున్నాయ్య ( మున్న ) నిర్మాత గా , కొండ్రాసి ఉపేందర్ , నందిపాటి శ్రీధర్ రెడ్డి సహా నిర్మాతలు గా , కృష్ణ వంశీ గారి వద్ద రైటర్ గా పని చేసిన ముని సహేకర రచన – దర్శకత్వం లో రూపొందిన చిత్రం ” మెకానిక్ – ట్రబుల్ షూటర్” అనే చిత్రం 02/02/2024 తేదీన విడుదల అయింది. ఇందులో మణి సాయి తేజ , రేఖ నిరోష హీరో హీరోయిన్స్ గా నటించగా తనికేళ్ళ భరణి , నాగ మహేష్ , సూర్య , కిరీటి , సునీత మనోహర్ , సంధ్య జనక్ , సమ్మెట గాంధీ , వీర శంకర్ , ఛత్రపతి శంకర్ , బిందాస్ భాస్కర్ , జబ్బర్థస్ట్ ఫణి తదితరులు నటించారు.

ముని సహేకర కొత్త దర్శకుడైన చిత్రాన్ని తెరకెక్కించిన తీరు , తన కలం నుంచి వచ్చిన మాటలు హృదయాలకు హత్తు కొనిపోయే విధంగా , ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా తనికెళ్ల భరణి కి , హీరో కి మధ్య వచ్చే సన్నివేశాలు పతాక స్థాయి కి తీసుకొని వెళ్లుతాయి. గాలికి తిరిగే హీరో తన గమ్యం ఏమిటో తెలిశాక. ఊరి సమస్య పరిష్కారం కోసం , తనను తాను ఒక టూల్ గా మలుచుకునే సన్నివేశంలో దర్శకుడు చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా , భారత దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్న ఒక భర్న్నింగ్ ప్రాబ్లెమ్ ను , కమర్షియల్ పాయింట్ లో చూపించిన విధానం విషయంలో దర్శకుడిని ఖచ్చితంగా అభినందించ తగ్గ విషయం.

ఇటీవల తెలుగు చిత్రాల్లో నటిస్తూ భాగా పరిచయం అయిన నటుడు నాగ మహేష్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ గా నటించారు. గ్రామ ప్రెసిడెంట్ గా ఆయన ఆహార్యం , గంభీరం తెలుగు తెరకు కొత్త విలన్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హీరో మణి సాయి తేజ విషయంకి వస్తే , పెద్ద హీరో చేయవలసిన బరువైన పాత్ర పోషించాడు. మెకానిక్ గా ఫుల్ మాస్ లుక్ లో అలరించాడు. తెలుగు వెండి తెర కు మరో మాస్ హీరో వచ్చినట్టే అని చెప్పాలి. హీరో తను చేసిన ఫైట్స్ విషయంలో , కరెంట్ పోల్ మీద రియల్ గా కూర్చొని నటించిన విధానం చూస్తే , అతనికి నటన పై ఉన్న ఆసక్తి ని తెలియజేస్తుంది.

హీరోయిన్ రేఖ నిరోష తన గత చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో అందంగా కనిపిస్తుంది. తన అభినయంతో యువతను ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో సహజంగా నటించిందని చెప్పాలి. ముఖ్యంగా నటుడు తనికెళ్ళ భరణి విషయంలో , సినిమా కి అతని పాత్ర అనడం కన్న , అది ప్రత్యేకమైన కథానాయకునిగా పాత్ర అని చెప్పాలి. ఆయన ఆ పాత్రకు జీవం పోశారు. ఆయన పాత్ర మంచి భావోద్రేకాలకి గురి చేస్తుంది.
ఈ చిత్రం నిర్మించిన నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించాలి. ఈ రోజు వస్తున్న రెగ్యులర్ కథలను కాకుండా , దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ని నమ్మి , నిర్మించిన నిర్మాతల అభిరుచి , ఒక మంచి సినిమా నిర్మించాలాని, సినిమా పట్ల వాళ్లకు ఉన్న ప్రేమను తెలియజేస్తుంది.

సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య కి , సాహిత్యాన్ని కూడా అందించిన దర్శకుడు ముని సహేకర పాటలు ఆల్రెడీ మంచి హిట్ అవ్వడంతో , ఈ చిత్రం విడుదల పై ప్రేక్షకులకి ఆసక్తి కలిగించింది. థియేటర్స్ కి వచ్చిన వాళ్ళు ఎక్కడ నిరుశ్చాహాపడరు. సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్యం రీరికార్డింగ్ మరో అద్భుతమని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో సినిమా చూసేటప్పుడు మనకు కన్నీళ్లు తెప్పిస్తాయి.
ఓ ప్రక్క పెద్ద సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేస్తూ , ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ హీరో తో మంచి వర్క్ అవుట్ చేయించాడు.

ఎడిటర్ శివ షార్ప్ కట్టింగ్ , కెమెరా మ్యాన్ శివరాం పని తనం భాగుంది. ఈ చిత్రం ద్వితీయార్థం లో వచ్చే సిద్ శ్రీరామ్ పాడిన “నచ్చేశావే పిల్ల .. నచ్చేశావే పిల్ల”.. పాట మరియు చివరలో వచ్చే కైలాష్ ఖేర్ పాట ఈ చిత్ర విజయంలో ప్రధాన భాగస్వామ్యం అయ్యాయని చెప్పాలి. ” గుడి కట్టగలను , ఆ గుడిలో విగ్రహం పెట్టగలను గానీ అందులోని దేవుడిని ఏ గుండె చేరద్దని ఆ దేవుడిని నేను శాచించాలేను ” ,”నింగిలో మబ్బులా మెరిసి బ్రతకడం కాదు నేల పై చినికుగా కురిసి బ్రతకడమే జీవితం”.. ఈలాంటి డైలాగులు ఒక మార్క్ లా నిలిచిపోతాయి.

ఓవరాల్ గా , ఓ మంచి భావోద్రేకాలు కలిగి , హృదయాన్ని హత్తుకునే చిత్రాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ మెకానిక్ – ట్రాబుల్ షూటర్. ఇది నిజంగా విన్నింగ్ షూటర్.
రేటింగ్ :3.25/5

Hot this week

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి : రిషబ్‌శెట్టి

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి నేషనల్ అవార్డు అందుకున్న కాంతారా...

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..!

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..! రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ..!జమ్మూ కశ్మీర్...

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!వరసుగా రెండు పర్యాయాలు గెలిచి హరియాణలో సర్కారు...

నాంపల్లి కోర్టులోఅక్కినేని ఫ్యామిలీ ..నాగార్జునపై పరువునష్టం దావా వేస్తాం !!

నాంపల్లి కోర్టులో మంత్రి కొండాపై ‘పరువునష్టం’ విచారణ వాంగ్మూలం ఇచ్చిన నాగార్జున, సుప్రియరాజకీయ...

జానీమాస్టర్‌కి ఒక రూల్‌..యడ్యూరప్పకు మరో రూలా..?

జానీమాస్టర్‌ అవార్డును రద్దు చేసిన కేంద్రం..! కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన కర్ణాటక కాంగ్రెస్‌..!ప్రముఖ...

Topics

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి : రిషబ్‌శెట్టి

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి నేషనల్ అవార్డు అందుకున్న కాంతారా...

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..!

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..! రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ..!జమ్మూ కశ్మీర్...

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!వరసుగా రెండు పర్యాయాలు గెలిచి హరియాణలో సర్కారు...

నాంపల్లి కోర్టులోఅక్కినేని ఫ్యామిలీ ..నాగార్జునపై పరువునష్టం దావా వేస్తాం !!

నాంపల్లి కోర్టులో మంత్రి కొండాపై ‘పరువునష్టం’ విచారణ వాంగ్మూలం ఇచ్చిన నాగార్జున, సుప్రియరాజకీయ...

జానీమాస్టర్‌కి ఒక రూల్‌..యడ్యూరప్పకు మరో రూలా..?

జానీమాస్టర్‌ అవార్డును రద్దు చేసిన కేంద్రం..! కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన కర్ణాటక కాంగ్రెస్‌..!ప్రముఖ...

హరియాణలో ఖాతా తెరవని ఆప్‌..! పెద్ద గుణపాఠమన్న కేజ్రీవాల్‌.

హరియాణలో ఖాతా తెరవని ఆప్‌..!హరియాణ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతా...

ఈడీ ఎదుట అజారుద్దీన్‌..! హెచ్‌సీఏ అవకతవకలపై విచారణ.

ఈడీ ఎదుట అజారుద్దీన్‌..! హెచ్‌సీఏ అవకతవకలపై విచారణమాజీ ఎంపీ, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు...

అభయని హత్యాచారం చేసింది సంజయ్‌రాయే : సీబీఐ

అభయని హత్యాచారం చేసింది సంజయ్‌రాయే..! కోర్టులో తొలి ఛార్జిషీట్ ప్రొడ్యూస్ చేసిన సీబీఐకోల్‌కతా...