మెకానిక్ అంటేనే మాస్. మెకానిక్ అనే పేరుతో తెలుగుతో పాటు సౌత్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడిదే ట్రెండ్ ను ఫాలో అవుతూ విశ్వక్ సేన్ హీరోగా మెకానిక్ రాకీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి రూపొందిస్తున్నారు. ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మెకానిక్ రాకీ సినిమా దీపావళికి అక్టోబర్ 31న రిలీజ్ కు రెడీ అవుతోంది.
చదవండి: జపాన్ రిలీజ్ కు సిద్ధమవుతున్న “హనుమాన్”
మెకానిక్ రాకీ గ్లింప్స్ లో టైటిల్ రోల్ కు తగినట్లే మెకానిక్ గా నటిస్తున్నారు విశ్వక్ సేన్. ఈ గ్లింప్స్ లో ఇద్దరు హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరిని పరిచయం చేశారు. కావాల్సినన్ని యాక్షన్ ఎలిమెంట్స్ గ్లింప్స్ లో ఉన్నాయి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని గ్లింప్స్ తో తెలుస్తోంది. పిల్లలకు, బఫూన్లకు జవాబు చెబుతా అంటూ విశ్వక్ సేన్ ఈ గ్లింప్స్ లో పంచ్ డైలాగ్ చెప్పారు.