ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకున్నారు నటుడు పృథ్వీరాజ్. ఆ తర్వాత వచ్చిన గుర్తింపుతో చాలా సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ, బెంగాల్ టైగర్ వంటి సినిమాల సక్సెస్ తో పృథ్వీరాజ్ కెరీర్ పీక్స్ కు వెళ్లింది. అదే టైమ్ లో వైఎస్ఆర్ సీపీలో చేరి జగన్ వెంట పాదయాత్రలు కూడా చేశాడు పృథ్వీ.
ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక పృథ్వీని ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ ను చేశాడు జగన్. అయితే అక్కడ ఓ మహిళా ఉద్యోగితో పృథ్వీ మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ బయటకు వచ్చి సంచలనమైంది. ఆ ఉద్యోగితో పృథ్వీ సంబంధం పెట్టుకున్నాడనే వార్తలతో ఎస్వీబీసీ ఉద్యోగులు ధర్నాలు చేశారు.
ప్రభుత్వం పృథ్వీని ఆ ఛానెల్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించింది. దీంతో పృథ్వీ రాజకీయ కెరీర్ తో పాటు సినిమా కెరీర్ కూడా గందరగోళంలో పడింది. ఆ టైమ్ లో చిరంజీవి తన ఆచార్య సినిమాలో పృథ్వీకి క్యారెక్టర్ ఇచ్చారు. చిరంజీవి అవకాశం ఇచ్చిన తర్వాత మిగతా సినిమాల్లోనూ పృథ్వీకి ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆయన కెరీర్ గతంలోలా స్పీడప్ కాలేదు.
ఇప్పుడు జనసేనలో చేర్చుకోవడం ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయంగా పృథ్వీకి మరో ఛాన్స్ ఇచ్చారు. అయితే మహిళలతో అసభ్యంగా మాట్లాడిన పృథ్వీని తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా పవన్ ఎలాంటి సందేశం ప్రజలకు ఇస్తున్నారో ఆలోచించాలి అనే విమర్శలు మొదలయ్యాయి. అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ పృథ్వీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.