లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్” డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్ లో లావణ్య పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. ఈ సిరీస్ ను ఇప్పటికే వరుణ్ చూశాడని, బాగుందని చెప్పాడని లావణ్య చెప్పింది. తను హీరోయిన్ గా కెరీర్ కొనసాగించడానికి మెగా ఫ్యామిలీ నుంచి, వరుణ్ తేజ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పింది.
లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ – వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదు. మెగా కుటుంబం నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. వరుణ్ లాంటి అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ ఉన్నాడు. మిగతా వాళ్లు నన్ను చూసే విధానంలో తేడా ఉందేమో. “మిస్ పర్ఫెక్ట్” సిరీస్ ను వరుణ్ చూసి మంచి క్వాలిటీతో బాగుందని చెప్పాడు. తనకు సిరీస్ మొత్తం నచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేశాడు. “మిస్ పర్ఫెక్ట్” సిరీస్ లో నటించడం ఎక్కడా ఛాలెంజింగ్ అనిపించలేదు. పైగా ఇది చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. నేను సినిమాల ఎంపికలో ఎప్పుడూ సెలెక్టివ్ ఉంటూ వచ్చాను. ఎక్కువ సినిమాల్లో నటించాలని ఆరాటపడలేదు. చేసినవి తక్కువ మూవీసే అయినా నటిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించా. అని చెప్పింది.