న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద మెగాస్టార్ చిరంజీవి పోస్టర్స్ డిస్ ప్లే చేశారు. ఆయనకు ఇటీవల పద్మవిభూషణ్ అవార్డ్ దక్కడం పట్ల కుందవరపు శ్రీనివాస నాయుడు అనే అభిమాని ఈ ఏర్పాటు చేశారు. టైమ్ స్క్వేర్ మీద మెగాస్టార్ ఫొటోస్ డిస్ ప్లే అవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాభిమానులు ఈ ఫొటోస్ ను బాగా షేర్ చేస్తున్నారు. మన దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ చిరంజీవికి దక్కడం పట్ల అభిమానులు ఇలా తమ సంతోషాన్ని ప్రదర్శిస్తున్నారు.
మెగాస్టార్ ఇంటికి సినీ, రాజకీయ ప్రముఖుల రాక ఇంకా తగ్గడం లేదు. సత్యదేవ్, సంపత్ నంది, సాయి కుమార్, ఆది సాయికుమార్, వేణు ఊడుగుల లాంటి ఇండస్ట్రీ వాళ్లంతా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చూస్తే మెగాస్టార్ త్వరలో విశ్వంభర సినిమా షూట్ లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థలో భారీ సోషియో ఫాంటసీ మూవీగా దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు.