కేరళ వయనాడ్ ప్రకృతి విపత్తు దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాధం పట్ల స్పందిస్తూ టాలీవుడ్ స్టార్స్ ఆర్థిక సాయం చేశారు. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి వాళ్లు కనీసం ఆలోచన కూడా చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు స్వయంగా కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ను కలిసి ఆ చెక్ ను అందించారు.
సాయం ప్రకటించడం గొప్ప విషయమే గానీ స్వయంగా ఆ రాష్ట్రం వెళ్లి తన సానుభూతి తెలపడం ఒక ఆత్మీయ భావాన్ని కలిగిస్తోంది. తనయుడు రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి ఈ సాయాన్ని ప్రకటించారు. వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి వందలమంది ప్రాణాలు కోల్పోయారు.