తన కొత్త సినిమా విశ్వంభర కోసం సన్నాహాలు మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇది ఆయన నటిస్తున్న 156వ సినిమా. భారీ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కు సిద్ధమవుతున్నారు చిరంజీవి. ఇందుకోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. బాడీ బిల్డింగ్ చేసి ఫిట్ గా కనిపించేందుకు శ్రమిస్తున్నారు. చిరంజీవి జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మెగాభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
విశ్వంభరలో యాక్షన్ పార్ట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ లో సహజంగా కనిపించేందుకు మ్యాన్లీగా కనిపించేందుకు రెడీ అవుతున్నారు చిరంజీవి. త్వరలో ప్రారంభం కాబోయే షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొనబోతున్నారు. విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు.