మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది. జనవరి 10న విశ్వంభర థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ ప్రకటనలో మెగాభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇదొక భారీ సోషియో ఫాంటసీ మూవీ. ఎన్నో వీఎఫ్ఎక్స్ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అయితే వచ్చే సంక్రాంతికే రిలీజ్ టార్గెట్ పెట్టుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. అయినా మూవీ టీమ్ తమ ప్రాజెక్ట్ మీద కాన్ఫడెన్స్ కు నమ్మకానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ బిగిన్ అయ్యింది. ఇందులో చిరంజీవి పాల్గొంటున్నారు. బింబిసార సినిమాను కోవిడ్ సీజన్ లోనూ ఇన్ టైమ్ లో ఫినిష్ చేసిన వశిష్ట…విశ్వంభరను కూడా జెట్ స్పీడ్ తో చేసేయాలని ప్లాన్ చేస్తున్నారు.