ఎన్టీఆర్ ‘దేవర’లో యాక్షన్ తో పాటు మ్యూజిక్ కు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండబోతున్నట్లు ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ తో తెలుస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫైర్ సాంగ్ ఇప్పటికే రిలీజ్ కాగా..ఇప్పుడు రొమాంటిక్ సాంగ్ రాబోతోంది. ‘దేవర’ నుంచి రెండో పాటను ఎల్లుండి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
చదవండి: ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్ష.. లిక్కర్ స్కాంపై సీఐడీ దర్యాప్తు మొదలవుతుందన్న చంద్రబాబు!
ఇక ఈ మేరకు ఇచ్చిన అప్డేట్ కోసం డిజైన్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దేవర పూర్తి రొమాంటిక్ మోడ్‌లో మారినట్టుగా కనిపిస్తోంది. జాన్వీ కపూర్ అందాలు ఆకర్షణ కాబోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.