మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. హీరోయిన్స్ కు కేటీఆర్ మత్తు పదార్థాలు అలవాటు చేశాడని, ఆ మత్తులో జల్సాలు చేశాడని కొండా సురేఖ అన్నారు.
కేటీఆర్ వల్లే కొందరు హీరోయిన్స్ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయారని కొండా సురేఖ చెప్పారు. ఇటీవల కొండా సురేఖ ఫొటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కొందరు. ఈ పని బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్లే చేశారంటూ మంత్రి కొండా సురేఖ చెబుతోంది. కేటీఆర్ ఇలాంటివి చేయిస్తున్నాడంటూ ఆమె ఆరోపిస్తోంది.
చదవండి: ప్రకాశ్‌రాజ్… నీవా నీతులు చెప్పేది..? పవన్ ఫ్యాన్స్
గతంలో కేటీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొన్ని న్యూస్ లు బాగా వైరల్ అయ్యాయి. అప్పటి ప్రతిపక్ష నాయకులు కొందరు రకుల్ రావు అనే సైటైర్ తో కేటీఆర్ ను పిలిచేవారు. సమంత, కేటీఆర్ మధ్య రిలేషన్ అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఆమెకు తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం కూడా ఈ రూమర్స్ కు ఊతమిచ్చింది. అప్పట్లో సమంత కూడా ఈ రూమర్స్ పై స్పందించింది. ఏది ఏమైనా విడాకులు తీసుకోవడం నాగచైతన్య, సమంత వ్యక్తిగత విషయం. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు తమ ఆరోపణల్లో ప్రస్తావించడం సరికాదు.