ఇండియన్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఓటీటీ కంటెంట్ కు ఒక ఊపు తీసుకొచ్చిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. క్రైమ్ యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయ్యింది. సక్సెస్ ఫుల్ గా రెండు సిరీస్ లు కంప్లీట్ కాగా…ఇప్పుడు సీజన్ 3 స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నిన్న అర్థరాత్రి నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్ 3 అందుబాటులోకి వచ్చింది.
మీర్జాపూర్ పూర్వాంచల్ లో ఆధిపత్యం కోసం జరిగే పోరాటాన్ని మరింత ఇంటెన్స్ గా ఈ సిరీస్ లో తెరకెక్కించారు. అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠీ, రసిక దుగాల్, ఇషా తల్వార్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రల్లో నటించారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ను ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. గుర్మీత్ సింగ్, ఆనంద్ ఐయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మీర్జాపూర్ , మీర్జాపూర్ 2 లాగే ఈ థర్డ్ సీజన్ పైనా భారీ అంచనాలు ఉన్నాయి.