వెబ్ సిరీస్ లలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నది మీర్జాపూర్ కే. ఈ ఐకానిక్ వెబ్ సిరీస్ ను ఓటీటీ లవర్స్ మర్చిపోలేరు. యాక్షన్, రొమాన్స్ కలిపి తెరకెక్కించిన మీర్జాపూర్ లో ఇప్పటికే రెండు సీజన్స్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మూడో సిరీస్ మీర్జాపూర్ 3 స్ట్రీమింగ్ కు రాబోతోంది. జూలై 5న ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ప్రీమియర్ కానుంది.
మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ లో పూర్వాంచల్ లో గ్యాంగ్ వార్ ను, క్రైమ్ ను చూపించారు. రొమాన్స్ కూడా ఉందంటూ చిన్న షాట్స్ లో చూపిస్తూ హింట్ ఇచ్చారు. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠీ, శ్వేతా త్రిపాఠీ, ఇషా తల్వార్ తదితరులు కీ రోల్స్ లో కనిపించారు. మీర్జాపూర్ 3 కూడా గత రెండు సీజన్స్ లాగే సాలిడ్ హిట్ కొట్టేలా ఉంది.