నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మళ్లీ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ట్రెండ్ అయ్యేందుకు కారణం ఈ సినిమా తాజాగా అనౌన్స్ చేసిన ఫిలింఫేర్ సౌత్ 2024 నామినేషన్స్ లో సత్తా చాటింది. మూడు మేజర్ కేటగిరీల్లో ఈ సినిమాకు నామినేషన్స్ దక్కాయి.
బెస్ట్ యాక్టర్ మేల్ గా నవీన్ పోలిశెట్టి, బెస్ట్ యాక్టర్ ఫీమేల్ గా అనుష్క శెట్టి, బెస్ట్ మూవీ కేటగిరీల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నామినేషన్ అందుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. గతేడాది సెప్టెంబర్ 7న రిలీజై తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులు ఆదరణ పొందింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.