రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ కు రెడీ అవుతోంది. తమిళనాడులోని కరైకుడిలో ఈ షెడ్యూల్ షూటింగ్ చేయబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో మిస్టర్ బచ్చన్ హీరో రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ బయలుదేరారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరైకుడిలో కీలక షెడ్యూల్ షూటింగ్ చేయబోతున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ నటించిన ది రైడ్ సినిమా తెలుగు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది. దేశంలో జరిగిన అతిపెద్ద ఇన్ కంట్యాక్స్ రైడ్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రవితేజ ఇన్ కం ట్యాక్స్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు.