నాని సినిమాలో విలన్ ఫిక్స్..!
‘ద ప్యారడైజ్’లో విలన్‌గా మోహన్‌బాబు..!
గతేడాది హీరో నానితో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ చేసిన చిత్రం ‘దసరా’. ఈ చిత్రం మార్కెట్ పరంగా గట్టి వసూళ్లే రాబట్టంది. సుమారు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి క్రిటిక్స్ నోళ్లు మూయించేలా చేసింది. దసరా మూవీతో తొలిసారి మెగాఫోన్ పట్టిన శ్రీకాంత్ ఓదెల పనితీరుకు అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు. అలాగే నాని కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. అయితే ఇప్పుడు మరోమారు వీరిద్దరి కాంబోలో ఓ చిత్రం పట్టాలెక్కబోతుంది. అదే ‘ద ప్యారడైజ్’ చిత్రం.
హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రానికి ‘ద ప్యారడైజ్’ అని టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా, ఆల్రెడీ లీక్ అయిపోయింది కాబట్టి ఆ టైటిల్‌నే ఫిక్స్ అయిపోయారు. ఇక, విలన్ పాత్ర విషయంలో ఎవరైతే బాగుంటుందనేది అన్న విషయంలో మూవీ టీమ్ చాలా రోజులు తర్జన భర్జన పడ్డారని టాక్. అయితే ఇప్పుడీ విషయంలోనూ ఓ క్లారిటీ వచ్చేసింది. విలన్‌గా డైలాగ్ కింగ్ మోహన్‌బాబును ఫిక్స్ చేశారట. తొలుత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నేరుగా మోహన్‌బాబును కలిసి కథ వినిపించారట. కథ నచ్చి ఓకే చెప్పడమే కాదు, టాలెంటెడ్ హీరో నాని చేయడంతో ఆయనతో కలిసి నటించేందుకు మోహన్‌బాబు సై అన్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.