రవితేజ, హరీష్ శంకర్ కాంబో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. రవితేజ చెప్పిన పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. “సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు… సంపద కాపాడేవాడు కూడా సైనికుడే..”అనే డైలాగ్ ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో గ్రాండియర్ కనిపిస్తుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. రవితేజ, నా కాంబినేషన్ పై ఉన్న అంచనాలు దాటే సినిమా మిస్టర్ బచ్చన్ అవుతుందనే నమ్మకం వుంది. మిరపకాయ్ కి సినిమా రవితేజ గారే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకి కూడా ఆయనే టైటిల్ పెట్టారు. భాగ్యశ్రీ బోర్సే తెలుగు నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పింది. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తన క్యారెక్టర్ ని మ్యాచ్ చేసింది. ఆగస్ట్ 15న అమితాబ్ బచ్చన్ గారి షోలే సినిమా రిలీజైయింది. రవితేజ గారి బచ్చన్ అదే డేట్ కి రావడం ప్యూర్ కో-ఇన్సిడెంట్. ఇది అనుకోకుండా వచ్చింది కాబట్టి ట్రైలర్ లో యాడ్ చేశాం. ఆగస్ట్ 15న మా సినిమాతో పాటు డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. రెండు సినిమాలని బ్లాక్ బస్టర్ చేయాలి’ అని కోరారు.