మూవీ రివ్యూ – మిస్టర్ బచ్చన్‌

Spread the love

షాక్, మిరపకాయ్ తర్వాత రవితేజ హీరోగా…హరీశ్‌ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ బాణీలు అందించగా మాస్ మహరాజా సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇక ప్రతికథనాయకుడి పాత్రలో జగపతిబాబు నటించారు.

ఈ సినిమా మాతృక బాలీవుడ్ రైడ్ ఆధారంగా రూపొందిన చిత్రమే మిస్టర్‌ బచ్చన్. వింటేజ్ లుక్‌లో రవితేజను చూస్తే మళ్లీ 20 ఏళ్ల వెనక్కి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. రవితేజలో ఉండే ఎనర్జీని వాడుకుని, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఆయనను స్టైలిష్ లుక్‌లో చూపించడంలో దర్శకుడు హరీశ్ శంకర్ సక్సెస్ అయ్యాడు. హీరో కనపడే ప్రతి ఫ్రేమ్‌లో ఎలివేషన్ షాట్స్ అద్భుతమనే చెప్పాలి. ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్‌ ఇచ్చిన స్టంట్స్‌ థియేటర్‌లో ప్రేక్షకులని ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. సినిమా ఆరంభం నుంచి ఎండింగ్ వరకు వచ్చే ఫైట్ సీన్స్‌, సిట్యువేషన్‌కు తగ్గట్టుగా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ ఈ పిక్చర్‌కు పెద్ద అస్సెట్‌ అని చెప్పాలి. హీరోయిన్ విషయానికి వస్తే మార్వాడీ అమ్మాయి జిక్కీ పాత్రలో భాగ్యశ్రీ బోర్సే తన అందంతో, అభినయంతో కట్టిపడేసింది. మల్లెతీగలాంటి కటౌట్‌తో ప్రేక్షకులకు నయనానందాన్ని ఇచ్చిపడేసింది. కామెడీ యాక్టర్ సత్య గురించి చెప్పాల్సిన పనిలేదు. నవ్వుల పువ్వులు పూయించి తనదైన శైలిలో కామెడీ ట్రాక్‌ను ఒంటిచేత్తో నడిపించాడనే చెప్పొచ్చు.

చదవండి: ముగిసిన విదేశీ పర్యటన – హైదరాబాద్‌కు రేవంత్ టీమ్‌

కథ విషయానికి వస్తే…

మిస్టర్ బచ్చన్‌ స్టోరీ 1980-90 దశకానికి సంబంధించింది కాబట్టి ఆనంద్‌ (రవితేజ) తండ్రి తనికెళ్ల భరణికి అమితాబ్ బచ్చన్ అంటే ప్రాణం. ఆయనకు వీరాభిమాని. ఇంట్లో ఉన్న గోడలపై అమితాబ్‌ ఫోటోలతోనే కాదు, చివరికి కన్నకొడుకు ఆనంద్‌ (రవితేజ) పేరును బచ్చన్‌గా మార్చి అమితాబ్‌పై తనప్రేమను చాటుకుంటాడు. అయితే తండ్రి పెట్టిన బచ్చన్‌ పేరును సార్థకం చేస్తూ అమితాబ్ డైలాగ్‌లను, అతని సాంగ్స్‌ను పాడి అందరి చేత సెహభాష్ అనిపించుకుంటాడు మనహీరో. అయితే వృత్తిరీత్యా ఇన్‌కమ్ ట్యాక్స్‌ ఆఫీసర్‌ అయిన బచ్చన్‌…సొసైటీలోని బిగ్‌షాట్స్‌పై గురిపెట్టి సినీఫక్కీలో రైడ్‌ చేసి వాళ్ల వద్దనున్న అక్రమ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు తరలించి వారందరినీ జైలు ఊచలు లెక్కించడం చేస్తుంటాడు. అయితే ఓ రోజు పైఅధికారుల అండదండలు పుష్కలంగా ఉన్న ఓ బిగ్‌షాట్‌ ఇంటిపై రైడ్‌ చేయగా, నిజాయతీగల బచ్చన్ వారు చెప్పింది వినకపోవడంతో సస్పెండ్ అవుతాడు. ఈ క్రమంలో మన హీరో సొంతూరుకు వచ్చేయడం…అక్కడ హీరోయిన్‌ జిక్కీని చూడటం…ప్రేమలో పడటం…ఆమెను తనవైపునకు తిప్పుకునేలా లవ్ ట్రాక్ నడపడం ఫస్ట్ హాఫ్‌లో చకాచకా జరిగిపోతాయి. అయితే వీరిద్దరి వ్యవహారం హీరోయిన్ తల్లిదండ్రులకు తెలిసిపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తంచేస్తారు…ఏం చేస్తున్నావని నీకు నా కూతురుని ఇవ్వాలని నిలదీసే సమయానికి ఠక్కున వచ్చిన ఒకే ఒక్క ఫోన్‌ కాల్‌ ఇరువురి కుటుంబాల్లో ఆనందాన్ని నింపేలా చేస్తుంది. మళ్లీ నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వు బచ్చన్ అని పై అధికారి నుంచి వచ్చిన ఆ ఫోన్‌కాల్‌తో హీరో, హీరోయిన్ కుటుంబాలు కలిసిపోతాయి. మరో నాలుగైదు రోజుల్లో మ్యారేజ్ ఫిక్స్‌ చేసుకున్న బచ్చన్‌కు పై అధికారి బిగ్ టాస్క్ ఇస్తాడు. మూడుసార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి మంత్రిగా పనిచేసిన ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) దగ్గర వెలకట్టలేని ఆస్తులు ఉన్నాయని, ఈ కేసును నువ్వు టేకప్‌ చేసి త్వరగా పూర్తిచేయాలని చెప్పడంతో…తన టీమ్‌తో విలన్ ఇంటికి వెళ్లిన బచ్చన్‌కు ఎలాంటి అవినీతి సొమ్ము దొరకదు. అయితే చివరికి ముత్యం జగ్గయ్య అవినీతి సొమ్మును నాలుగురోజులపాటు అదే ఇంట్లో ఉండి ఎలా పసిగడతాడు…ఈ క్రమంలో ఎంత ప్రలోభ పెట్టినా బచ్చన్ వినకపోవడంతో చివరికి ముత్యం జగ్గయ్య ప్రధాని దగ్గరకు వెళ్లి ఏం రిక్వెస్ట్ చేస్తాడు…పొలిటికల్‌గా జగ్గయ్య తన ఆస్తులను కాపాడుకునే ప్రయత్నాలు ఫలిస్తాయా…లేదా…చివరికి విలన్ ఉచ్చులో చిక్కుకున్న బచ్చన్‌ పెళ్లిపీటలపై ఉన్న హీరోయిన్ జిక్కీ మెడలో తాళి ఎలా కడతాడు అనేది చిత్ర కథాంశం.

చిత్ర బలాబలాలు
రవితేజ అవుట్‌స్టాండ్‌ యాక్టింగ్ & లుకింగ్
హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే అందచందాలు & క్యూట్ పెర్‌ఫార్మెన్స్‌
మిక్కీ జే మేయర్ బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
ఫైట్ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో స్టంట్స్‌
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీతో సినిమాకు రిచ్‌లుక్‌

చిత్ర బలహీనతలు
హీరోయిజాన్ని ఎలివేట్ చేసే క్రమంలో దారితప్పిన కథనం…
సెకండాఫ్‌ అంతా విలన్ ఇంట్లో ఉండి స్టోరీ సాగడం…
ఫస్ట్ హాఫ్‌లో విలన్‌ను క్రూరంగా చూపి ద్వితీయార్థంలో క్యారెక్టర్‌ను వీక్ చేసేయడం…
ప్రేక్షకుడు జీర్ణించుకోలేని విధంగా తన ఇంట్లో ఐటీ రైడ్‌పై నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధానినే విలన్ కలవడం…
మిస్‌ఫైర్ అయిన అన్నపూర్ణ తల్లి క్యారెక్టర్‌…
పండని చమ్మక్‌ చంద్ర, ప్రభాస్ శ్రీనుల కామెడీ ట్రాక్‌…

ఓవరాల్‌గా చెప్పాలంటే మాస్ మహరాజా రవితేజను ఎలా అయితే చూడాలని అభిమానులు కోరుకుంటారో అలా చూపించాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. బచ్చన్ క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసి ఒంటిచేత్తో సినిమాను రవితేజ ముందుకు నడిపించాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

(గమనిక – ఈ మూవీ రివ్యూ ప్రేక్షకుడి అభిప్రాయ పరిధిలోనిది మాత్రమే)

రేటింగ్ 3/5

Hot this week

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

Topics

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...

మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

'రాజాసాబ్ ' డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్...