రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ గెస్ట్ రోల్స్ డిజైన్ చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ గెస్ట్ రోల్స్ కోసం దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఆ లిస్టులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది. 2898 ఏడీ సినిమాలో ఓ ఇంపార్టెంట్ గెస్ట్ లో కోసం దర్శకుడు ఈ హీరోయిన్ ను అప్రోచ్ అయ్యారు.
ఇంత భారీ ప్రాజెక్ట్ లో గెస్ట్ రోల్ చేయడం కూడా హ్యాపీగానే ఫీలవుతున్న మృణాల్ ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. వైజయంతీ సంస్థకు సీతారామం వంటి సూపర్ హిట్ ఇచ్చిన హీరోయిన్ కాబట్టి ఆమె లక్ ఫ్యాక్టర్ కూడా మేకర్స్ కన్సిడర్ చేస్తున్నారు. 2898 ఏడీ రిలీజ్ డేట్ ను మే 9గా ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ డేట్ కు సినిమాను తీసుకొచ్చేందుకు యూనిట్ టార్గెటెడ్ గా పనిచేస్తున్నారు.